Breaking News

జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం

Published on Fri, 07/17/2026 - 07:44

కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన రక్షణశాఖ మంత్రి ఫెదోరోవ్‌ ను ఆపదవి నుంచి తప్పించారు. రక్షణమంత్రితో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జెలెన్‌ స్కీ నిర్ణయంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. కాగా ఫెదోరవ్‌ రష్యాపై దాడుల సమయంసలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ, ఫెదోరోవ్ మధ్య వ్యూహాత్మక విభేదాలు వచ్చాయి. తాను ప్రతిపాదించిన సైనిక సంస్కరణలను సిర్స్కీ కావాలనే అడ్డుకున్నారని తనతో చర్చించడానికి సైతం నిరాకరించారని ఫెదోరోవ్ స్వయంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలగింపు జరిగింది.

కాగా ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కీవ్, ఖార్కివ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి విజయాలు సాధించిన ఫెడోరోవ్‌ను తొలగించడం సరికాదని, ఆయనపై రాజకీయ కక్షలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

ఫెదోరవ్‌ ఈ ఆరునెలల కాలంలో సాధించిన విజయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్యా సైన్యానికి స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందకుండా పూర్తిగా నిలిపివేయడం, డ్రోన్ల సహాయంతో రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంలోని రవాణా వ్యవస్థను దెబ్బతీయడం,  రష్యా ఇంధన క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయడం విజయాలుగా అభివర్ణించారు.

నాటో ప్రమాణాలకు అనుగుణంగా రక్షణ శాఖను పూర్తిగా మార్చలేకపోవడం, సైనిక కొనుగోళ్లలో అవినీతి పాత పద్ధతులను పూర్తిగా నిర్మూలించలేకపోవడం వైఫల్యాలుగా చెప్పుకున్నారు.

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)