Breaking News

ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్‌ విమానాలు ధ్వంసం!

Published on Sun, 06/01/2025 - 19:36

కీవ్:  రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది.  తాజాగా  ఉక్రెయిన్ చేసిన దాడుల్లో  40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో  40 ఎయిర్ క్రాఫ్ట్‎లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది.  సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల  దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. 

ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్‌పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.

2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!
ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల  ద్వారా  తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్‌  దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చేశామని రష్యా  చెబుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)