Breaking News

రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి

Published on Mon, 06/02/2025 - 08:49

మాస్కో: ఉక్రెయిన్‌ తాజాగా రష్యాపై డ్రోన్‌ దాడులతో విరుచుకు పడింది. రష్యన్ భూభాగంలోని ఐదు ఎయిర్‌బేస్‌(Airbase)లపై ఉక్రెయిన్‌ దాడి చేసింది. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘కైవ్ (ఉక్రెయిన్‌)ప్రభుత్వం.. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్,అముర్ ప్రాంతాలలోని వైమానిక స్థావరాలపై ఎఫ్‌పీవీ డ్రోన్‌లను ఉపయోగించి, ఉగ్ర దాడికి పాల్పడింది. అయితే తమ సైన్యం ఆ ఉగ్ర దాడులను తిప్పికొట్టింది. సైనికులకు, పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ దాడుల్లో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం’ అని  ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ దాడులలో  తమ విమానాలు  కొన్ని ఆహుతయ్యాయని రష్యా తెలిపింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాలలోని సైనిక వైమానిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుండి ఎఫ్‌పీవీ డ్రోన్‌(FPV drone)లను ప్రయోగించడంతో పలు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తరువాత మంటలు ఆరిపోయాయని రష్యా పేర్కొంది. అయితే తాము చేపట్టిన ఈ దాడిలో రష్యాకు చెందిన 40 విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్‌బీయూ) ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.

రష్యా- ఉక్రెయిన్‌లు ఇస్తాంబుల్‌లో రెండవ దఫా శాంతి చర్చలు ప్రారంభించనున్న తరుణంలో ఈ దాడులు  చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ ప్రచురణ  సంస్థ  ప్రావ్దా అందించిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ ఈ దాడులకు ఏడాదిగా ప్లాన్‌ చేసింది.  డ్రోన్లు బయటకు దూసుకువచ్చి,  లక్ష్యంగా ఎంచుకున్న వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. క్షిపణుల ఆయుధాగారం లేని ఉక్రెయిన్ దానికి బదులుగా దాడులకు తెగబడేందుకు భారీగా డ్రోన్‌లను సమకూర్చుకుంది. 

ఇది కూడా చదవండి: దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు