Breaking News

పుతిన్‌ దాడులు ఆపాలంటే.. ఇదే కరెక్ట్‌ ప్లాన్‌: జెలెన్‌స్కీ

Published on Sat, 04/05/2025 - 07:45

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా సైన్యం దాడిలో మరో 16 మంది చనిపోయినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంపై జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాపై అమెరికా ఇప్పటికైనా ఒత్తిడి పెంచాలి అని డిమాండ్‌ చేశారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా వీడియాలో మాట్లాడుతూ.. రష్యా క్షిపణి దాడి తర్వాత ప్రస్తుతం క్రివీ రిహ్‌లో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి, ఆరుగురు పిల్లలు సహా 16 మంది మరణించారు. ఖార్కివ్‌ లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ దాడి తర్వాత రోజంతా సహాయక చర్యలు కొనసాగాయి. ఆరు "షాహెద్" డ్రోన్‌లతో రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా దాడి చేసింది. ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదు. రష్యా స్వయంగా అమెరికాతో కాల్పులు విరమణ గురించి చర్చించినప్పటికీ దాడులను కొనసాగిస్తోంది.  కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పదేపదే ఉల్లంఘిస్తున్నారు.

అందుకే రష్యాపై ఒత్తిడి చాలా అవసరం. రష్యాపై ఇంకా ఆంక్షలు విధించాలి. కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్‌పై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తేనే రష్యా దాడులు చేయకుండా ఉండగలదు. మార్చి 11వ తేదీ నుంచి పుతిన్‌ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే పుతిన్‌ దారిలోకి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా, అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై ఫోకస్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులతో ట్రంప్‌ చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కోసం ప్రయత్నించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)