Breaking News

నార్త్‌ కొరియా సైన్యం ఎక్కడ.. పుతిన్‌ ప్లాన్‌ మార్చాడా?

Published on Sat, 02/01/2025 - 09:28

కీవ్‌: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌ దళాలతో ధీటుగా పోరాడలేక ఉత్తర కొరియా సైనికులు తమ దేశానికి వెనుదిరుగుతున్నట్టు ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు. కిమ్‌ దళాలు దాదాపు ఉక్రెయిన్‌ నుంచి వెళ్లిపోయినట్టు తెలిపారు. ఈ క్రమంలో తాము పైచేయి సాధించినట్టు చెప్పుకొచ్చారు.

తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ ఫోర్సెస్‌ ప్రతినిధి ఒలెక్సాండర్‌ కిండ్రాటెంకో మాట్లాడుతూ.. ‘గత మూడు వారాలుగా మాతో యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలను గుర్తించలేదు. మా సైనికుల చేతిలో ఓడిపోయి భారీ నష్టాలు చవిచూడటంతో వారు వెనుదిరిగినట్లు విశ్వసిస్తున్నాం. నార్త్‌ కొరియాకు చెందిన సైనికులు ఎక్కడా కనిపించడం లేదు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇక.. ఉక్రెయిన్‌తో జరుగుతోన్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 10 వేల మంది కిమ్ సైనికులు సాయపడుతున్నారు. ప్రత్యేక శిక్షణ అనంతరం వీరిని కదన రంగంలో దింపినప్పటికీ.. మాస్కో, కొరియన్‌ సైనికుల మధ్య భాష సమస్య కారణంగా సమన్వయం లోపించింది. ఈక్రమంలోనే కిమ్‌ సైనికులు తమ దళాల చేతిలో మృతి చెందుతున్నారని కీవ్‌ ప్రకటించింది.

మరోవైపు.. ఉక్రెయిన్‌ అధికారుల వ్యాఖ్యలపై రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కొవ్‌ ఘాటు స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ అధికారులు చెప్పిన వ్యాఖ్యల్లో నిజం లేదు. దీనిలో భిన్నమైన వాదనలు ఉన్నాయి. ప్రతిసారీ వ్యాఖ్యానించలేం అంటూ కొట్టిపారేశారు.

ఇదిలా ఉండగా.. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ చేసిన తర్వాత ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని చెప్పారు. అనంతరం.. యుద్ధం నిలిపేసేందుకు ఇరు దేశాధ్యక్షులు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో ఈ చర్చలకు వచ్చేందుకు రష్యా నిరాకరిస్తే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తికరంగా మారింది.

Videos

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)