రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

Published on Sun, 09/01/2024 - 07:43

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ సేనలు రష్యాపై దాడులతో విరుచుకుపడుతున్నాయి. రష్యాలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా బాంబు, డ్రోన్‌ దాడులు చేస్తోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి రష్యా రాజధాని మాస్కో, ఇతర ప్రాంతాలే టార్గెట్‌గా ఉక్రెయిన్‌ ఆర్మీ డ్రోన్‌ దాడికి  పాల్పడినట్లు రష్యా అధికారులు ఆదివారం వెల్లడించారు. మాస్కో వైపు దూసుకువచ్చిన డ్రోన్‌ను రష్యా ధ్వంసం చేసిందని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.

అదేవిధంగా రష్యా  నైరుతి ప్రాంతంలోని బ్రయాన్స్క్ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ప్రయోగించిన కనీసం 12 డ్రోన్‌లు కూడా ధ్వంసం చేసినట్లు ఆ ప్రాంత గవర్నర్ అలెగ్జాండర్ బోగోమాజ్ పేర్కొన్నారు. మానవరహిత దాడిలో కుర్స్క్ ప్రాంతంపై రెండు వాహనాలను కూడా కూల్చివేశామని తాత్కాలిక గవర్నర్ అలెక్సీ స్మిర్నోవ్ తెలిపారు.  ఈ ప్రాంతాన్ని ఉక్రెయిన్ సైన్యం  పాక్షికంగా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ డ్రోన్‌ దాడుల వల్ల ఎలాంటి గాయాలు, నష్టం జరగలేదని రష్యా అధికారులు తెలిపారు. అదేవిధంగా.. గత  కొన్ని రోజులుగా  దాడుల్లో వేగం  పెంచిన ఉక్రెయన్‌  రష్యా భూభాగాలను స్వాధీనం  చేసుకోవటమే   టార్గెట్‌గా  ముందుకు సాగుతోంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)