Breaking News

రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడి

Published on Wed, 08/21/2024 - 06:57

ఉక్రెయిన్‌- రష్యాల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. తాజాగా ఉక్రేనియన్ దళాలు పశ్చిమ రష్యాలోని సెమ్ నదిపై ఉన్న మూడు వంతెనలను ధ్వంసం చేశాయి. దీనికి సంబంధించిన వివరాలను రష్యన్  అధికారులు మీడియాకు వెల్లడించారు.

పశ్చిమ రష్యాపై ఉక్రెయిన్ దాడి మూడో వారంలోకి ప్రవేశించింది. రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో జరిగిన కీవ్ దాడి.. యుద్ధ పరిణామాలను ఊహకందని విధంగా మార్చివేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యాపై ఇదే  అతిపెద్ద దాడి అని చెబుతున్నారు. ఈ తాజా దాడి నేపధ్యంలో ఉక్రెయిన్  విజయోత్సవాలు చేసుకుంటుండగా, అదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్‌ను కూడా స్వాధీనం చేసుకునే దిశగా రష్యా ముందుకు కదులుతోంది.

కుర్స్క్ పరిధిలోని సెయిమ్ నదిపైగల మూడు వంతెనలపై ఉక్రేనియన్ దాడి  చేసింది. ఉక్రెయిన్ వైమానిక దళ కమాండర్ సెమ్ నదిపైగల వంతెనలపై జరిపిన దాడులకు సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. కుర్స్క్ ప్రాంతంలో దాడి మొదలుపెట్టినప్పటి నుండి ఉక్రేనియన్ దళాలు 1,250 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, 92 రష్యా స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.

తమ దేశంపై భవిష్యత్తులో జరిగే సరిహద్దు దాడులను నిరోధించేందుకు ‘బఫర్ జోన్’ను ఏర్పాటుచేసే లక్ష్యంతో  ఉన్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్ దగ్గర భారీ సంఖ్యలో రష్యన్ యుద్ధ ఖైదీలు ఉన్నారని తెలిపారు. రష్యా తన దగ్గరున్న ఉక్రెయిన్‌ పౌరులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  ఇదిలావుండగా ఉక్రేనియన్ సైన్యం జరిపిన దాడిలో తమ దేశానికి చెందిన 17 మంది మృతిచెందారని, 140 మంది గాయపడ్డారని రష్యన్ మెడికల్ సర్వీస్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)