Breaking News

రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న ఉక్రెయిన్‌ దళాలు!

Published on Tue, 11/26/2024 - 16:03

మాస్కో: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్‌ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్‌ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌ దాడుల్లో ప్లాంట్‌ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా పోరులో అమెరికా.. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.

ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్‌ నాన్‌ స్ట్రాటజిక్‌ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్‌ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్‌పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)