Breaking News

రష్యా పైశాచికత్వం!.. ఉక్రెయిన్‌ సైనికుల శరీర భాగాలతో..

Published on Fri, 07/26/2024 - 08:58

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రష్యా సైనికుల ఆగడాలు పీక్‌ స్టేజ్‌ చేరుకున్నాయి. యుద్ధంలో చనిపోయిన ఉక్రెయిన్‌ సైనికుల అవయవాలను రష్యా అమ్ముకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.

కాగా, ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో చేతిలో బంధీలుగా ఉండి చనిపోయిన ఉక్రెయిన్‌ సైనికుల బాడీల్లో పలు అవయవాలు మిస్‌ అయినట్టు గుర్తించారు. అయితే, రష్యాకు సంబంధించిన జైళ్లలో ఉక్రెయిన్‌ సైనికులకు దారుణంగా హింసించి చంపేశారు. అనంతరం, వారి మృతదేహాలను ఉక్రెయిన్‌కు పంపించారు. అయితే, సైనికుల మృతదేహాలను కుటుంబ సభ్యులు పరిశీలించడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

సైనికుల శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. వారి అవయవాలు దొంగిలించారని గుర్తించాం. రష్యా సైనికులు దారుణాలకు ఒడిగట్టారు. అవయవాలు దొంగతనం చేసిన బ్లాక్‌ మార్కెట్‌ వాటిని అమ్ముకున్నారు. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి. వెంటనే ఈ దురగతాలను ఆపాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. రష్యా  సైన్యం చేతిలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలు కరెక్ట్‌ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌, రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది ఉక్రెయిన్‌ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు సమాచారం. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు