Breaking News

Virat: మే డే.. మే డే.. సాయం కావాలి

Published on Sat, 11/29/2025 - 21:30

రష్యాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ ‘విరాట్’పై నల్లసముద్రంలో దాడి జరిగింది. అందులో ఉన్న సిబ్బంది అత్యవసర సందేశాలు పంపిన సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ అందులో సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారు. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్‌ ప్రకటించుకుంది.

‘‘ఇది విరాట్. సాయం కావాలి! డ్రోన్ దాడి! మేడే!’’ అని సిబ్బంది అంటున్న ఆడియో రికార్డు అయింది.  అంతకుముందు శుక్రవారం రాత్రి కూడా ఈ నౌకపై దాడులు జరిగాయి. అందులోని సిబ్బంది ‘డ్రోన్ దాడి’ అంటూ రేడియోలో అత్యవసర సందేశం పంపారు. ఇటు టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

‘విరాట్’కు స్వల్ప నష్టమే జరిగిందని సమాచారం. ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని.. సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది. నల్ల సముద్ర తీరం నుంచి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. 

రష్యా ‘షాడో ఫ్లీట్’Shadow Fleet  ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. సీ బేబీ (Sea Baby) డ్రోన్ల ద్వారా ఈ దాడులు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.  

విరాట్‌ అనేది రష్యా షాడో ఫ్లీట్‌ లో భాగమైన ఆయిల్ ట్యాంకర్. షాడో ఫ్లీట్‌ అనేవి పాశ్చాత్య ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు రవాణా చేసే నౌకలు.
అయితే వీటిపై దాడుల వల్ల నల్ల సముద్రంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. ఇక సీ బేబీ (Sea Baby) డ్రోన్లు అనేవి ఉక్రెయిన్ అభివృద్ధి చేసిన అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs). మనుషులు లేకుండా సముద్రంపై నడిచే చిన్న బోట్ల రూపంలో ఉండే డ్రోన్లు. ఇవి ప్రధానంగా కమికాజే దాడులు (తమను తాము పేల్చుకునే దాడులు) చేయడానికి ఉపయోగిస్తారు.

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)