Breaking News

బైడెన్‌ గ్రీన్‌సిగ్నల్‌..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు

Published on Tue, 11/19/2024 - 17:16

కీవ్‌: అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్‌ అనుమతివ్వగానే ఉక్రెయిన్‌ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్‌రేంజ్ ఆర్మీ ట్యాక్‌టికల్‌(ఏటీఏసీఎంఎస్‌) మిసైల్‌ను మంగళవారం(నవంబర్‌ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్‌ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్‌ మీడియా కథనాలు ప్రచురించింది.

రష్యా,ఉక్రెయిన్‌ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్‌ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్‌ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్‌హిడ్‌ మార్టిన్‌ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్‌  లాంగ్‌రేంజ్‌ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో ‌ రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్‌ దాడులు చేసే వీలుంది.

రష్యాపై లాంగ్‌రేంజ్‌ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్‌ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్‌ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్‌ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఉక్రెయిన్‌ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యా

తమ దేశంపైకి ఉక్రెయిన్‌ ఆరు అమెరికా తయారీ లాంగ్‌రేంజ్‌ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.

ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్‌ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. 

ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్‌ పచ్చజెండా 

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)