Breaking News

అతి చేష్టలు: ఉక్రెయిన్‌కు రష్యా న్యూఇయర్‌ విషెస్‌

Published on Tue, 01/03/2023 - 10:43

కీవ్‌: కొత్త ఏడాది ఆరంభంలో ఉక్రెయిన్‌ యుద్ధం ఉద్రిక్తంగా మారింది. రష్యా బలగాల విజృంభణ.. ప్రతిగా ఉక్రెయిన్‌ బలగాల కౌంటర్‌తో సరిహద్దు రక్తసిక్తం అవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రష్యా న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలియజేసింది రష్యా. అయితే ఆ పరిణామం ఉక్రెయిన్‌ భగ్గుమంటోంది. కారణం.. 

డ్రోన్‌ దాడులతో ఆ శుభాకాంక్షలు తెలియజేయడమే!. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చెందిన ఓ పోలీస్‌ అధికారి తన ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. హ్యాపీ న్యూఇయర్‌, బూమ్‌ అంటూ అక్షరాలు రాసి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే మైదానంలో పడింది ఆ డ్రోన్‌. 

అదొక చీప్‌, టేస్ట్‌లెస్‌ మెసేజ్‌. ఇరాన్‌ ఆధారిత డ్రోన్‌పై రాసి ఉంది. ఉగ్రవాద దేశం, దాని సైన్యం తీరు గురించి మీరంతా తెలుసుకోవాల్సిన విషయం అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారాయన. మరోవైపు అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం ఇదొక అతి చేష్టగా అభివర్ణించారు. ఉక్రెయిన్‌ బలగాలు రష్యా బలగాలకు ధీటుగా సమాధానం ఇస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 40కి పైగా డ్రోన్‌లతో రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై మొదటిరోజే దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)