Breaking News

ట్రంప్‌ ప్రతిపాదనతో ఆటలొద్దు

Published on Sun, 03/16/2025 - 05:13

లండన్‌:  ఉక్రెయిన్‌– రష్యా మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన ఒప్పందంతో ఆటలాడొద్దని రష్యా అధినేత పుతిన్‌ను యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి కియర్‌ స్టార్మర్‌ హెచ్చరించారు. పుతిన్‌ నిజంగా శాంతిని కోరుకుంటే అది చాలా సులభంగా సాధ్యమవుతుందని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాలని, ఉక్రెయిన్‌పై వెంటనే దాడులు నిలిపివేయాలని చెప్పారు. శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. 

30 రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలంటూ డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన చక్కటి ప్రతిపాదనకు రష్యా ప్రభుత్వం అడ్డుపుల్లలు వేస్తోందని మండిపడ్డారు. శాంతియుత పరిస్థితులు నెలకొనడం పుతిన్‌కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేస్తామని, అప్పుడు మరో గత్యంతరం లేక ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించక తప్పదని వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చలకు పుతిన్‌ సిద్ధమైతే, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా కొనసాగేలా తాము బాధ్యత తీసుకుంటామని స్టార్మర్‌ తెలిపారు.

ఆయన శనివారం యూరప్‌తోపాటు మిత్రదేశాల అధినేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ భేటీలో 25 దేశాల నేతలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై, పుతిన్‌ వైఖరిపై చర్చించారు. రెండు దేశాల మధ్య శాశ్వతంగా శాంతి నెలకొనాలని ఈయూ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌ తదితర దేశాలన్నీ కోరుకుంటున్నట్లు స్టార్మర్‌ తెలిపారు. రష్యా మెడలు వంచడానికి అవసరమైతే సైన్యాన్ని సైతం రంగంలోకి దించడానికైనా సిద్ధమేనని సంకేతాలిచ్చారు. ప్రాక్టికల్‌ ప్లానింగ్‌తో ‘ఆచరణ దశ’ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని ఉద్ఘాటించారు.

వర్చువల్‌ సమావేశంలో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ పాల్గొన్నారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య కాల్పుల విరమణ ప్రక్రియ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా, రష్యా మొండి వైఖరితో ఆగిపోయిందని జెలెన్‌స్కీ విమర్శించారు. కాల్పుల విరమణను అడ్డుకోవడానికి రష్యా కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా, శాంతి కోసం మరింత చొరవ తీసుకోవాలని యూరప్‌ దేశాలు నిర్ణయానికొచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించేలా పుతిన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఏం చేయాలన్న దానిపై చర్చించడానికి యూరప్‌ దేశాల మిలిటరీ ప్లానింగ్‌ సమావేశం వచ్చేవారం జరగబోతోంది.   

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)