Breaking News

గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌.. మైనర్ బాలికపై వందల మంది అత్యాచారం..?

Published on Tue, 06/02/2026 - 23:58

లండన్‌: బ్రిటన్‌లో సంచలనం సృష్టించిన గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌  దారుణాలను అక్కడి పార్లమెంటులో ఎంపీ రూపెర్ట్‌ లోవ్ బహిర్గతం చేశారు. యూకే వ్యాప్తంగా కనీసం 85 ప్రాంతాలలో ఈ గ్యాంగులు యాక్టివ్‌గా ఉన్నాయని వారిలో అధికంగా పాకిస్థానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు పేర్కొన్నారు.

గ్రూమింగ్స్‌ గ్యాంగ్స్‌ ఆగడాలకు సంబంధించి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు మైనర్‌ బాలికలపై రాక్షసత్వంతో ముఠా అత్యాచారాలు  చేసినట్లు నివేదిక తేల్చింది. ఈ కేసులో పలువురు బాధితురాలను స్వతంత్ర కమిటీ విచారించింది. అందులో మైనర్ బాలికలను అత్యంత క్రూరంగా బోనులో బంధించి అమానవీయంగా అత్యాచారానికి పాల్పడ్డారని ఒక బాధితురాలు చెప్పినట్లు నివేదిక పేర్కొంది.

ఒక బాధిత  బాలిక మాట్లాడుతూ.. 13 ఏళ్ల వయసున్నప్పటి నుంచి తనపై దాదాపు  600 నుండి 700 మంది పురుషులు తనపై అత్యాచారం చేశారని ఆ బాధితురాలు తెలిపింది. మరో బాధితురాలు .. 15 నుండి 20 మంది అమ్మాయిలను బోనుల్లో  బంధించి ఉంచడం చూశానని, వారిపై అమానవీయంగా, క్రూరంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పేర్కొంది. ఇవే కాక మరెన్నో మైనర్లపై మరెన్నో ఆగడాలు బ్రిటన్ వ్యాప్తంగా గ్రూమింగ్‌ గ్యాంగ్స్ చేశాయని ఎంపీ పేర్కొన్నారు. 

ఈ ముఠాలలో ప్రధానంగా పాకిస్తానీ సంతతికి చెందిన పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఈ దారుణాలపై ఇక మాటలు చాలు, చేతల్లో కఠిన చర్యలు కావాలి. రాబోయే రోజుల్లో విడుదల కాబోయే మా 'రేప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్' బ్రిటన్ భవిష్యత్తును మారుస్తుంది అని ఎంపీ రూపెర్ట్ లోవ్ స్పష్టం చేశారు.ఈ దారుణాలను అణచడంలో స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఘోరంగా విఫలమయ్యారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే..?

'గ్రూమింగ్ గ్యాంగ్స్' అంటే... ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేసి, వారిని మభ్యపెట్టి, నమ్మించి, ఆపై క్రూరంగా లైంగికంగా వాడుకునే వ్యవస్థీకృత నేర ముఠాలు 'గ్రూమింగ్' అంటే ఒకరిని నమ్మించి, లొంగదీసుకోవడం. ఈ ముఠాలు సాధారణంగా పేదరికం, కుటుంబ సమస్యలు లేదా ఒంటరితనంతో బాధపడుతున్న 11 నుండి 16 ఏళ్ల లోపు బాలికలను (ఎక్కువగా తెల్లజాతి బాలికలను) టార్గెట్ చేస్తాయి.
 

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)