Breaking News

యూఏఈ వీసా ఆన్‌ అరైవల్‌.. షరతులు వర్తిస్తాయి

Published on Sat, 10/19/2024 - 05:26

అబుదాబి: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్‌ అరైవల్‌ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్‌ యూనియన్‌ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్‌ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. 

అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్‌ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్‌ యూనియన్‌ దేశం లేక యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్‌–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)