Breaking News

UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష

Published on Tue, 07/23/2024 - 09:25

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యూఏఈ)లో బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు  జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో  ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.

బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు.  యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.

బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్‌లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)