Breaking News

అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’

Published on Wed, 01/21/2026 - 01:00

భారత్‌-యూఏఈ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత‌ బలోపేతం కానున్నాయి. భారతీయ సంస్కృతి, చ‌రిత్ర‌ను చాటిచెప్పేలా అబుదాబిలో ‘హౌస్ ఆఫ్ ఇండియా’ ఏర్పాటుకు యూఏఈ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటనలో భాగంగా తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఇదొకటి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'లూవ్రే అబుదాబీ'వంటి మ్యూజియం ఉన్న సాదియాత్ కల్చరల్ డిస్ట్రిక్ట్ లోనే ఈ 'హౌస్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విశేషం. 

ఇందులో యోగా,ఆయుర్వేదం వంటి భారతీయ పురాతన సంప్రదాయాలను డిజిటల్ గ్యాలరీల రూపంలో పర్యాటకులకు వివరించనున్నారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, భారతీయ పారిశ్రామికవేత్తలు, కళాకారులు, విద్యావేత్తలు సమావేశమయ్యేలా ఒక 'బిజినెస్ అండ్ కల్చరల్ హబ్'గా ఈ హౌస్ ఆఫ్ ఇండియా పనిచేయనుంది.

ఇప్పటికే అబుదాబిలో బీఏపీఎస్ హిందూ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయం ప్రధాని నరేంద్ర చేతుల మీదగా ప్రారంభమైంది. కాగా యూఏఈ అధ్యక్షుడు కేవలం రెండు గంటల పర్యటన కోసం భారత్‌కు సోమవారం(జనవరి 19) వచ్చిన సంగతి తెలిసిందే.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు