Breaking News

గాల్లోనే ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. చెన్నై పర్యాటకుడు మృతి!

Published on Tue, 11/03/2026 - 09:59

కాఠ్మాండు: నేపాల్‌లోని పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ వైపు వెళ్లే మార్గంలోని సోలుఖుంబు ప్రాంతంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ల్యాండింగ్ అవుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనతో కలకలం చెలరేగింది.

సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద ప్రమాదం
నేపాల్‌లోని సోలుఖుంబు హెలిప్యాడ్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన రెండు హెలికాప్టర్లు ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్ పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం సుమారు 8.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. రెండు హెలికాప్టర్లు హెలిప్యాడ్ వద్ద దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
 

ఈ ఘటనలో తమిళనాడులోని చెన్నైకి చెందిన 47 ఏళ్ల పర్యాటకుడు వాసంత్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఫిష్‌టెయిల్ ఎయిర్ హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తున్న మరో వ్యక్తి షైలేష్ కృష్ణ పటేల్ (49) కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన న్యూజిలాండ్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన ఆయనను  హెలికాప్టర్‌లో ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లకు చెందిన పైలట్లు రవీంద్ర ప్రజాపతి, ప్రజ్వల్ కేసీ కూడా గాయపడ్డారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)