Breaking News

ఇజ్రాయెల్‌ పీఎం నెతన్యాహు ఇంటిపై బాంబు దాడి.. సంచలన వీడియో

Published on Sun, 11/17/2024 - 08:00

జెరూసలేం: గాజా, హిజ్బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి జరిగింది. ఫ్లాష్ బాంబ్ దాడి కారణంగా పేలుడు ధాటికి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. బాంబు దాడి సమయంలో నెతన్యాహు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

వివరాల ప్రకారం.. ఉత్తర ఇజ్రాయెల్‌లోని సిజేరియా నగరంలో ప్రధాని నెతన్యాహు ఇంటి గార్డెన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఫ్లాష్‌ బాంబు దాడి జరిగింది. బాంబు దాడి సందర్బంగా గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. ఇక, దాడి జరిగిన సమయంలో ప్రధాని నెతన్యాహు, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడితో అక్కడ ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, నెతన్యాహు ఇంటిపై దాడి జరగడం ఇది రెండోసారి.

మరోవైపు.. ఇజ్రాయెల్‌ ప్రధాని ఇంటిపై బాంబు దాడిని ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ త్రీవంగా ఖండించారు. నెతన్యాహు ఇంటిపై దాడికి సంబంధించి త్వరితగతిన దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నెతన్యాహును రెచ్చగొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఇజ్రాయెల్ భద్రతా మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ మాట్లాడుతూ.. ప్రధాని ఇంటిపై ఫ్లాష్ బాంబ్ విసరడం వల్ల రెడ్ లైన్ క్రాస్ చేసినట్లైంది.. దానికి తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సిందేనని వార్నింగ్‌ ఇచ్చారు. బాంబు దాడికి పాల్పడిన వారిపై ప్రతి దాడి తప్పదని కామెంట్స్‌ చేశారు. 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)