Breaking News

సంచలన సైకో ‘ట్విటర్‌ కిల్లర్‌’ ఉరితీత

Published on Fri, 06/27/2025 - 09:43

జపాన్‌లో సుమారు మూడేళ్ల తర్వాత మరణశిక్ష అమలు చేశారు. ‘ట్విటర్‌ కిల్లర్‌’గా పేరున్న తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi)ని శుక్రవారం ఉరి తీసినట్లు ఆ దేశ న్యాయశాఖ అధికారికంగా ప్రకటించింది. సోషల్‌ మీడియాలో పరిచయం పెంచుకుని.. ఆపై అతికిరాతంగా హత్యాచారం చేయడంతో ఇతనికి ఆ పేరు ముద్రపడింది.  సంచలనం సృష్టించిన ఈ సీరియల్‌ కిల్లర్‌ ఉదంతంతో.. షాకింగ్‌ విషయాలే వెలుగు చూశాయి అప్పట్లో.. 

సామాజిక వేదిక ట్విట్టర్‌లో పరిచయమైన బాలికలను, మహిళలకు నమ్మించి.. మాయమాటలు చెప్పి తకహిరో షిరాయిషి(Takahiro Shiraishi).. తన అపార్టుమెంట్‌కు రప్పించుకుని లైంగికదాడికి పాల్పడేవాడు. ఆపై డబ్బు, ఇతర విలువైన వస్తువులు లాక్కుని.. అనంతరం చంపేసి వారి తల, మొండెం, కాళ్లు, చేతులు.. శరీర భాగాలన్నీ ముక్కలుగా నరికిపడేసేవాడు.

2020లో ఈ సీరియల్ కిల్లర్‌కు టోక్యో కోర్టు మరణశిక్ష విధించింది. తకహిరో షిరాయిషి.. ట్విట్టర్‌లో ఆత్మహత్యకు సంబంధించిన పోస్టులు పెట్టే యువతనే టార్గెట్‌గా చేసుకునేవాడు. బాధను తనతో పంచుకోమంటూ మాటల కలిపి.. స్నేహం చేసేవాడు. అనంతరం ఇద్దరం కలిసి చనిపోదామంటూ నమ్మకం కలిగించేవాడు. ఆ తరువాత తన ఇంటికి రప్పించి వారిని హతమార్చేవాడు. ఇలా ఏకంగా తొమ్మిది మందిని హత్య చేశాడు. వారిలో 26 ఏళ్ల లోపు ఎనిమిది మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.  

🧠 వెనుక కథ
తకహిరో షిరాయిషి 1990లో జపాన్‌లో జన్మించాడు. అతను "ట్విటర్ కిల్లర్"గా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే అతను ట్విటర్ వేదికగా ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వ్యక్తులను టార్గెట్ చేసి, వారిని తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి హత్య చేశాడు కాబట్టి.

🧪 హత్యల మోడ్ ఆఫ్ ఆపరేషన్
2017 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య, అతను 15–26 ఏళ్ల వయసున్న 8 మంది యువతులు, ఒక యువకుడిని హతమార్చాడు
బాధితులను మాయ చేసి, "ఆత్మహత్యలో సహాయం చేస్తానని" చెప్పి తన ఇంటికి రప్పించేవాడు
హత్య చేసిన తర్వాత, శరీర భాగాలను ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లలో దాచేవాడు
అతని అపార్ట్‌మెంట్‌లో 9 తలలు, చేతులు, కాళ్ల ఎముకలు లభించాయి

⚖️ న్యాయ విచారణ & శిక్ష
2020లో కోర్టు అతనికి మరణదండన విధించింది
అతను మొదట హత్య చేశానని చెప్పినా, తర్వాత ఆ వాదనను తిరస్కరించాడు
2025 జూన్ 27న జపాన్‌లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు

📌 సామాజిక ప్రభావం
ఈ కేసు జపాన్‌ను తీవ్రంగా కుదిపేసింది. సోషల్ మీడియా వేదికలపై భద్రత, ఆత్మహత్యలపై చర్చలు ముమ్మరమయ్యాయి. జపాన్‌లో మరణశిక్షపై ప్రజల మద్దతు ఎక్కువగా ఉండటంతో ఈ తీర్పు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

#

Tags : 1

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)