Breaking News

ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే?

Published on Mon, 06/30/2025 - 19:34

యుద్ధాలు, అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే.. వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అ దేశం పేరు తువాలు. హవాయి, ఆ్రస్టేలియా మధ్యలో పసిఫిక్‌ మహాసముద్రంలో తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం. ఇక్కడి జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా ఆ్రస్టేలియాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రజలు దేశాన్ని వీడటానికి కారణమేంటి? వాతావరణం ఆ దేశానికి ముప్పుగా ఎలా మారింది? ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది చూద్దాం. 

తువాలు.. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ. అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం. 1978లో బ్రిటిష్‌ పాలకుల నుంచి నుంచి స్వాతంత్య్రం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలవు. స్కూబా డైవింగ్‌కు ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక ఈ దేశంలో అతి పెద్ద దీవి.. పగడపు దీవి అయిన ఫనాఫుటి. ఇది దేశ రాజధాని కూడా.

దీనికి కొన్ని ప్రదేశాల్లో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్‌వే లాంటి భూమి ఉంది. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆ్రస్టేలియాకు వలసపోతారు. వీరికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆ్రస్టేలియా ల్యాండ్‌మార్క్‌ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది.

ఇప్పటివరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు.. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతోపాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది. 2050 నాటికి తువాలులో సగానికి పైగా భూమి మునిగిపోతుందని, ఇక  2100 నాటికి 90శాతం దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాన మంత్రి ఫెలేటి టియో తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎవరూ అక్కడ నివసించలేకపోయినా, తువాలుకు గుర్తింపు ఇస్తామని ఆస్ట్రేలి యా హామీ ఇచ్చింది 
    –  

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)