Breaking News

Turkey: పార్లమెంటులో ఎంపీల రణరంగం

Published on Thu, 02/12/2026 - 08:21

అంకారా: టర్కీ పార్లమెంటు బుధవారం యుద్ధభూమిని తలపించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సమక్షంలో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అది చివరకు పరస్పర దాడులకు దారితీసింది. నూతన న్యాయశాఖ మంత్రి అకిన్ గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఎంపీలు ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణల నేపథ్యంలో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా న్యాయశాఖ మంత్రిగా నియమితులైన అకిన్ గుర్లెక్‌ను పోడియం వద్దకు రాకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. అధికార ఏకే పార్టీ సభ్యులంతా గుర్లెక్‌కు రక్షణగా నిలవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. సభా విరామం అనంతరం భారీ భద్రత మధ్య గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు. గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేతలపై రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.

గుర్లెక్ నియామకం దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎర్డోగాన్ రాజకీయ ప్రత్యర్థిగా భావించే ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లుపై గుర్లెక్ కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. గత ఏడాది అవినీతి ఆరోపణలపై ఇమామోగ్లును అరెస్ట్ చేయగా, గుర్లెక్ ఆయనపై ఏకంగా 142 నేరాలకు సంబంధించి అభియోగపత్రం దాఖలు చేశారు. ఇందులో గరిష్టంగా 2,000 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అధ్యక్షుడు ఎర్డోగాన్ చేపట్టిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో న్యాయశాఖతో పాటు అంతర్గత వ్యవహారాల శాఖలోనూ మార్పులు జరిగాయి. ఎర్జురం ప్రావిన్స్ గవర్నర్ ముస్తాఫా చిఫ్చిని కొత్త అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న మున్సిపాలిటీలపై ప్రభుత్వం అవినీతి నిరోధక దాడులను ఉధృతం చేసిన తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే వందలాది మంది ప్రతిపక్ష మున్సిపల్ అధికారులను అరెస్ట్ చేశారు. ఈ తాజా నియామకాలు టర్కీ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా  ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: భారత్‌తో ఒప్పందం చారిత్రాత్మకం: ట్రంప్‌

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)