Breaking News

‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

Published on Sun, 06/08/2025 - 10:24

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ మధ్య అంతకంతకూ వైరం తీవ్రస్థాయికి చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యలు తీసుకోవాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్‌ను హెచ్చరించారు.  

వ్యయ బిల్లుపై మస్క్ విమర్శల అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ మధ్య స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నిలుస్తున్న రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్‌ బహిరంగంగా మస్క్‌కు హెచ్చరించారు.  ట్రంప్ తీసుకువస్తున్న బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు  తమకు భారీగా నిధులు సమకూర్చాలని ఎలాన్‌ మస్క్‌ను కోరారు. దీనికి మస్క్ సమ్మతించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలాన్‌ మస్క్‌ను ట్రంప్‌  హెచ్చరించారు.

ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్‌ ట్రంప్‌, అత్యంత ధనవంతుడైన ఎలాన్‌ మస్క్‌ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఎలాన్‌ మస్క్‌తో సంబంధాన్ని సరిదిద్దుకోవాలనే ఆసక్తి తనకు లేదని, ఆయనతో మాట్లాడే ఉద్దేశ్యం కూడా తనకు తనకు లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మస్క్‌ తీవ్ర విమర్శలు చేసిన దరిమిలా వారి మధ్య సంబంధం తెగిపోయింది.

ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్‌ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)