Breaking News

ఉక్రెయిన్‌-రష్యా మధ్య ‘మూడు ముక్కలాట’.. మరో కొత్త ట్విస్ట్‌

Published on Thu, 03/20/2025 - 07:14

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా మధ్య కాల్పులు విరమణ ఒప్పందంలో రోజుకో ట్విస్ట్‌ చోటుచేసుకుంటోంది. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా పుతిన్‌ తన ఇష్టానుసారం ఉక్రెయిన్‌పై మరోసారి దాడులకు పాల్పడ్డారు. దీంతో, అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌కు మరిన్ని వైమానిక రక్షణ పరికరాలను అందంచనున్నట్టు వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

తాజాగా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి రష్యా అంగీకరించడం లేదు. అందుకే ఉక్రెయిన్‌ సాయం అందించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్‌కు వైమానిక రక్షణ పరికరాలను యూరప్‌ నుంచి పంపించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా.. శాంతిని కోరుకుంటున్నామని, 30 రోజులపాటు ఉక్రెయిన్‌ ఇంధన, మౌలిక వసతులపై దాడులు చేయబోమని సూత్రప్రాయ అంగీకారానికి సిద్ధపడిన రష్యా వెనువెంటనే దాడులకు దిగింది. రష్యా డ్రోన్లు జనావాసాలపై దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ బుధవారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో దాదాపు గంటకుపైగా ఫోన్‌లో మాట్లాడిన కొద్దిగంటలకే రష్యా మళ్లీ తన భీకర దాడులను మొదలుపెట్టడం గమనార్హం. దాడులు ఆపబోమని తాజా ఘటనతో రష్యా చెప్పేసిందని, సమీ పట్టణంలోని ఒక ఆస్పత్రిపై, ప్రజల ఇళ్లపై డ్రోన్ల దాడులు జరిగాయి. మరోవైపు.. మాస్కోనే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని కీవ్‌ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)