Breaking News

తాలిబాన్‌లకు ట్రంప్‌ హెచ్చరిక: ‘బాగ్రామ్’ ఇవ్వకపోతే అంతుచూస్తాం..

Published on Sun, 09/21/2025 - 08:17

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాలిబాన్లపై మరింత ఒత్తిడిని పెంచారు. 2021లో అమెరికా వదిలివేసిన బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి ఇవ్వాలని తాలిబాన్లను డిమాండ్ చేశారు. దీనిని అప్పగించని పక్షంలో చెడు పరిణామాలు  ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. చైనా అణు స్థావరాల వ్యూహాత్మక స్థానాన్ని ఎదుర్కొనేందుకు ట్రంప్ ఈ ప్రయత్నం తప్పనిసరని భావించారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరం స్వాధీనంపై సోషల్ మీడియాలో ట్రంప్‌ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఆధీనంలో ఉన్న బాగ్రామ్ వైమానిక స్థావరాన్నియునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్‌​ పేర్కొన్నారు. రెండు మైళ్ల రన్‌వేను కలిగి ఉండి, గతంలో బీ-52లు, బ్లాక్ హాక్స్‌లను కలిగిన ఈ స్థావరం పశ్చిమ చైనా నుంచి ఎదురయ్యే ముప్పును పర్యవేక్షించడంతో సహా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.  కాగా తాలిబాన్ అధికారులు ట్రంప్‌ హెచ్చరికను తిరస్కరించారు. బగ్రామ్ ఆఫ్ఘన్ నేల.. ఇది చైనా అవుట్‌పోస్ట్ కాదని ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేర్కొన్నారు.
 

ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లలో బాగ్రామ్ ఎయిర్‌బేస్ ప్రధానమైనదిగా ఒకప్పుడు ఉండేది. అప్పట్లో 40 వేల మంది సైనికులతో పాటు సివిలియన్ కాంట్రాక్టర్లు కూడా అక్కడ పనిచేసేవారు. అయితే, పలు కారణాలతో 2021 జులైలో అమెరికా సైన్యం బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేసింది. తరువాత  అది తాలిబాన్ల వశం అయింది. బాగ్రామ్‌కు అతి దగ్గరలో చైనాలోని కాఖ్గర్ ప్రాంతంలో ఓ న్యూక్లియర్ సైట్ ఉందని చెబుతారు.  తాజాగా చైనా న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భావించారు. చైనాపై నిఘా పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

 

 

బాగ్రామ్‌ను తిరిగి స్వాధీనం చేసుకుని, అక్కడినుంచి చైనాపై నిఘా ఉంచుతామని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే అమెరికాకు చెందిన ఉన్నతాధికారి  ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్లాన్స్ లేవని, అది సాధ్యం అవుతుందని అనుకోవడం లేదన్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా తదితర ఉగ్ర సంస్థల నుంచి దానిని స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అ​న్నారు.  ఇందుకోసం వందల సంఖ్యలో మిలటరీ దళాలు అవసరమవుతాయి. బాగ్రామ్ పునర్నిర్మించడానికి  భారీ మొత్తంలో ఖర్చవుతుందన్నారు.

 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)