Breaking News

ఈయూపై 25 శాతం సుంకాలు 

Published on Fri, 02/28/2025 - 04:56

వాషింగ్టన్‌: అమెరికా సుంకాల దెబ్బ యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)నూ తాకింది. ఈయూ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్‌ మీటింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యా యం జరుగుతోందని ఆరోపించారు. 

‘‘27 దేశాలున్న ఈయూ అమెరికా కార్లు, వ్యవసాయోత్పత్తులను అంగీకరించదు. కానీ మేం మాత్రం వారి నుంచి అన్నీ దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్‌ కార్ల దిగుమతులపై మేం విధిస్తున్న దానికంటే ఇది 4 రెట్లు ఎక్కువ’’ అంటూ మండిపడ్డారు. అసలు అమెరికాను ఇరుకున పెట్టేందుకే ఈయూ పుట్టిందని ట్రంప్‌ ఆరోపించారు. 

గట్టిగా బదులిస్తాం: ఈయూ
ట్రంప్‌ వ్యాఖ్యలపై ఈయూ కార్యనిర్వాహక విభా గమైన యూరోపియన్‌ కమిషన్‌ దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా విపణి. అమెరికాకు ఈయూ వరం. చట్టబద్ధం, వి వక్షారహితం అయిన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే ఈయూ గట్టిగా బదులిస్తుంది’’ అని కమిషన్‌ అధికార ప్రతినిధి ప్రకటించారు. 

అమెరికా, ఈయూ ఉద్రిక్తతలు
రెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెర దించేందుకు 1993లో ఈయూ ఏర్పాటైంది. అమెరికా కూడా దీన్ని ఓ చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ రెండింటి మధ్య కొంతకాలంగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్‌ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూ టర్న్‌ తీసుకోవడంతో కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 ఉక్రెయిన్‌ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలోనూ రష్యాకు అను కూలంగా అమెరికా నిలవడం నివ్వెరపరిచింది. ఈ యూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్య టిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్‌ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా సమయాభావం సాకుతో అది రద్దయింది! 
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)