Breaking News

వివేక్‌ రామస్వామికి ట్రంప్‌ మొండి చెయ్యి?

Published on Tue, 11/12/2024 - 10:59

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌.. వచ్చే ఏడాది (2025) జనవరిలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోపు తన పాలకవర్గం కూర్పుపై ట్రంప్‌ సమాలోచనలు చేస్తున్నారు. కీలకమైన విదేశాంగ శాఖ కార్యదర్శి పదవికి తనకు సన్నిహితుడైన మార్కో​ రూబియో పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి. అయితే.. 

ఇండో అమెరికన్ అయిన వివేక్‌ రామస్వామికి విదేశాంగ శాఖ కార్యదర్శి పదవిని ఇవ్వొచ్చనే గతంలో చర్చ నడిచింది. ఇప్పుడు మార్కో​ పేరు తెరపైకి వచ్చిన క్రమంలో.. వివేక్‌ రామస్వామికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? అనే చర్చ మొదలైంది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం.. రిపబ్లిక్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం వివేక్‌ రామస్వామి పోటీకి నిలబడ్డారు. ఆదరణ అంతంత మాత్రంగానే రాడంతో పోటీ నుంచి వైదొలిగి.. ట్రంప్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిస్తే.. వివేక్‌ రామస్వామికి కేబినెట్‌లో కీలక పదవి ఖాయమనే చర్చ నడిచింది. 

మరోవైపు.. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మార్కో​ రూబియో కీలకంగా వ్యవహించారు. రూబియో 2010 నుంచి సెనేట్‌లో పనిచేశారు. ఇక ఇండో అమెరికన్‌ అయిన నిక్కీ హేలీకి తన పాలకవర్గంలో చోటు ఇవ్వనంటూ ట్రంప్‌ బహిరంగంగానే ప్రకటించడం గమనార్హం. దీంతో వివేక్‌ రామస్వామి కూడా అలాంటి పరిస్థితే ఎదురు కావొచ్చనే విశ్లేషణలు నడుస్తున్నాయి. 

ఎవరీ మార్కో రూబియో 
రూబియో 2011 నుంచి సెనేటర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌పై సెనేట్ సెలెక్ట్ కమిటీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున జేడీ వాన్స్‌ను ట్రంప్‌ రన్నింగ్‌మేట్‌గా ప్రకటించకముందే రూబియో ఆ రేసులో ఉన్నారు.

చదవండి: వలసల నియంత్రణాధికారిగా టామ్‌ హొమన్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)