Breaking News

ఉక్రెయిన్‌పై ట్రంప్‌ ఫుల్‌ సీరియస్‌

Published on Mon, 11/24/2025 - 07:53

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌ నాయకత్వంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం ముగించడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు కీవ్‌ అసలు కృతజ్ఞత చూపించలేదని ట్రంప్‌ దుయ్యబట్టారు. జెనీవా వేదికగా అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

రష్యా దురాక్రమణకు పుల్‌స్టాప్‌ పెట్టేందుకు ఉద్దేశించిన అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్, పశ్చిమ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఆదివారం చర్చలు జరిపారు. యూకే, ఫ్రాన్స్, జర్మనీ జాతీయ భద్రతా సలహాదారులతో మొదటి దఫా చర్చలు ముగిశాయని ఉక్రెయిన్‌ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధ్యక్ష భవనం చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆండ్రీ యర్మాక్‌ ఎక్స్‌లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సోషల్‌ మీడియా ట్రుత్‌ వేదికగా స్పందిస్తూ.. గతంలోనే అమెరికా, ఉక్రెయిన్‌కు బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేది కాదు. ఇప్పుడు యుద్ధం ముగింపు కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఉక్రెయిన్‌ చూపిస్తున్న కృతజ్ఞత శూన్యం. ఉక్రెయిన్‌ కోసం మేము ఇంత చేస్తున్నా జెలెన్‌స్కీ​ మాత్రం మా మద్దతు ఇవ్వడం లేదు. అలాగే, రష్యాపై మేము ఆంక్షలు విధించి దారికి తెస్తుంటే యూరప్‌ మాత్రం మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోంది అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

జెలెన్‌స్కీ స్పందన..
మరోవైపు.. ట్రంప్‌ విమర్శల నేపథ్యంలో జెలెన్‌ స్కీ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉక్రెయిన్‌ విషయంలో అమెరికా చేస్తున్న కృషికి మేము కృతజ్ఞులం. మాకు అమెరికా నాయకత్వం ఎంతో ముఖ్యమైనది. వీలైనంత వరకు మేము నిర్మాణాత్మకంగా పనిచేస్తూనే ఉన్నాం అని చెప్పుకొచ్చారు.  

ఉ‍క్రెయిన్‌పై ఒత్తిడి.. 
ఇదిలా ఉండగా.. యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికా ప్రతిపాదిత 28 పాయింట్ల ఒప్పందంలో దురాక్రమణకు పాల్పడిన రష్యాకే అనుకూలంగా ఉండటంపై యూరప్‌ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపాదనలను సమీక్షించేలా అమెరికాపై ఒత్తిడి తేవాలని ఉక్రెయిన్‌ను అవి కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ప్రణాళికకు ప్రత్యామ్నాంగా 28 పాయింట్లతో ఈయూ కొత్త ప్లాన్‌ను తెరపైకి తెచ్చింది. ఉక్రెయిన్‌ సార్వభౌమాధికారం కాపాడాల్సిందే అని ప్రతిపాదన చేసింది. అమెరికా ప్లాన్‌కు కౌంటర్‌గా ఈయూ ప్రణాళికను రూపొందించింది. ఇక,అంతకుముందు.. ఈ ఒప్పందంతో దేశ సార్వభౌమత్వమా? అమెరికా మద్దతును నిలుపుకోవడమా? తేలిపోనుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించడం తెలిసిందే. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)