అంతర్జాతీయ పీస్ మిషన్ ప్లాన్‌లో ట్రంప్..?

Published on Sun, 01/18/2026 - 12:50

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చేస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. అనేక అంతర్జాతీయ సంస్థలను తన ‍ఆర్థిక, అంగ బలంతో గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు తానే అధ్యక్షుడిగా ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ నిర్మించబోతున్నట్లు  తెలుస్తోంది.

ట్రంప్‌కున్న తలబిరుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయ సంస్థలన్నీ  అమెరికా దయా దాక్షిణ్యాల మీదే ఆధారపడతాయని అందుకే  ఆ దేశం మాటే చెల్లాలని ఆయన తరచుగా వాదిస్తారు. ఈ నేపథ్యంలోనే  ఐక్యరాజ్యసమితిపై కూడా ట్రంప్ పలుమార్లు విమర్శలు చేశారు.  అంతేకాకుండా  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు నిధులు తగ్గించడంతో పాటు కొన్ని సంస్థలను బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక అంతర్జాతీయ పీస్ మిషన్ స్థాపించబోతున్నట్లు బ్లుూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. అందులో చేరే ప్రతి సభ్యదేశానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పీస్ మిషన్ తీసుకునే ప్రతి నిర్ణయాలకు ఆ సంస్థ అధ్యక్షుడి నిర్ణయం త‍ప్పనిసరై ఉండేలా నియమాలు రూపొందించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

అయితే ఏ దేశమయితే 1బిలియన్ డాలర్లు సంస్థకు విరాళంగా ఇస్తుందో ఆ దేశానికి సంస్థ యెుక్క శాశ్వత సభ్యత్యం లభిస్తుందని తెలిపింది. ఈ శాంతి ఆర్గనైజేషన్ యెుక్క ఉద్దేశం అంతర్జాతీయంగా శాంతిని సుస్థిరపరచడమేనని పేర్కొంది. అయితే ఈ శాంతిమిషన్‌లో చేరడానికి 1బిలియన్ డాలర్లు చెల్లించాలనే  అనే వాదన పూర్తిగా అవాస్తవం అని వైట్‌హౌస్‌ తెలిపింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)