Breaking News

USA: ‘ఈసారి నేను గెలవకపోతే’.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Sun, 03/17/2024 - 11:21

వాషింగ్టన్‌: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్‌తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘నేను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నేను గనుక గెలవకపోతే ఈ దేశంలో మళ్లీ మీకు ఎన్నికలు ఉంటాయో లేదో చెప్పలేను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో బైడెన్‌ క్యాంపెయిన్‌ టీమ్‌ స్పందించింది. ‘ట్రంప్‌ మళ్లీ జనవరి 6 (2021లో వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌పై దాడి జరిగిన రోజు)ను కోరుకుంటున్నాడు. ట్రంప్‌ తీవ్రవాద, కక్షపూరిత వైఖరికిగాను నవంబర్‌లో ప్రజలు అతడికి మళ్లీ ఓటమిని రుచి చూపించనున్నారు’ అని బైడెన్‌ టీమ్‌ ఎక్స్‌(ట్విటర్‌) పోస్టు చేసింది. 

కాగా, ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ పడ్డ జో బైడెన్‌, ట్రంప్‌ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే రెండు పార్టీల ప్రైమరీ బ్యాలెట్‌లలో వీరిద్దరే అధ్యక్ష అభ్యర్థులుగా నామినేట్‌ అయ్యారు. 1952, 1956లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మాత్రమే ఒకసారి పోటీపడ్డ ఇద్దరు అభ్యర్థులు తిరిగి రెండోసారి పోటీపడ్డారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికాలో గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మళ్లీ ఈ ఏడాది ఎన్నికల్లో పోటీపడనుండటం విశేషం.  

ఇదీ చదవండి.. హౌతీల డ్రోన్‌ను పేల్చేసిన అమెరికా 

Videos

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు