Breaking News

సుంకాలపై ట్రంప్‌ కొత్త ట్విస్ట్‌.. అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 06/28/2025 - 09:00

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందన్నారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై తొమ్మిది గడువును ఇప్పుడే నిర్ణయించలేమని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా, అమెరికా అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.

అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్చ ఉంది. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు. అయితే, నేను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతాను. మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 25 శాతం చెల్లిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే సుంకాలపై పెంపు నిర్ణయం మరింత వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బీసెంట్‌ సంకేతాలు ఇచ్చారు. అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్‌ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని హింట్‌ ఇచ్చారు.

కెనడాతో కష్టం..
అలాగే, కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని పేర్కొన్నారు.

అధ్యక్ష పదవి డేంజర్‌..
ఇక, తాజాగా ట్రంప్‌ హైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్‌ గుర్తుచేసుకున్నారు. అనంతరం, ట్రంప్‌.. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతలను కారు రేసింగ్‌, బుల్‌ రైడింగ్‌ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈవిషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, గతంలో ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్‌లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)