Breaking News

‘మాది జీరో.. ఖర్చంతా మీదే’.. ఉక్రెయిన్‌కు ట్రంప్‌ షాక్‌

Published on Mon, 07/14/2025 - 08:31

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన రెండవ దఫా పాలనలో వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవి కొన్ని దేశాలకు షాకిస్తున్నాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్‌కు పిడుగుపాటులా మారింది.  ట్రంప్‌ తన తాజా ప్రకటనలో ఉక్రెయిన్‌కు నూతన ఆయుధాలు సమకూర్చేందుకు అమెరికా ‘జీరో డాలర్లు’ ఖర్చు చేస్తుందని, అందుకు అయ్యే ఆర్థిక భారాన్ని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) మోయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

ఉక్రెయిన్‌కు రాబోయే కాలంలో పంపించే ఆయుధాల బిల్లును అమెరికా భరించబోదని, ఆ ఆర్థిక బాధ్యత ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌పైనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పేర్కొన్నారు. ఇందుకోసం మేము జీరో డాలర్లు ఖర్చు చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2022లో రష్యా  దండయాత్రను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు సైనిక, మానవతా సహాయాలను అందించడంలో అమెరికా కీలకపాత్ర పోషించింది. అయితే ఇకపై అలాంటి సహాయం అందబోదని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

యూరోపియన్ దేశాలు ప్రాంతీయ భద్రతను పరిపుష్టం చేసేందుకు మరింతగా సాయం అందించాలని అమెరికాను కోరిన దరిమిలా అధ్యక్షుడు ట్రంప్‌ తన దీర్ఘకాల వైఖరిని వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న నిరంతర దాడిపై స్పందించిన ట్రంప్..  రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విషయంలో తీవ్ర అసహనంతో ఉన్నారని సమాచారం. కాగా ట్రంప్ తాజా ప్రకటన  కొత్త చర్చకు దారితీసింది. తన ప్రత్యర్థి రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు అమెరికా సైనిక మద్దతుపై ఎక్కువగా ఆధారపడుతున్న ఉక్రెయిన్‌కు ఇది  పిడుగుపాటులా పరిణమించింది. అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై యూరోపియన్ యూనియన్ ఇంకా స్పందించలేదు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)