Breaking News

వెనెజువెలా బాధ్యతపై ట్రంప్ సంచలన ప్రకటన

Published on Tue, 01/06/2026 - 15:28

వెనెజువెలా భవిష్యత్తుపై ట్రంప్ తన ప్లాన్‌ను ప్రకటించారు. ఆదేశంలో ఇప్పట్లో ఎన్నికలు ఉండవని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని మౌళిక సదుపాయాలు, సంస్థాగత నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. వెనెజువెలా బాధ్యత ఎవరూ చూసుకుంటారు అని రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఇట్స్‌..మీ అని ట్రంప్ బదులిచ్చారు.

కొద్దిరోజుల క్రితం వెనెజువెలాపై యుఎస్ దాడి చేసి..  అక్కడి అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెనెజువెలా తదుపరి అధ్యక్షుడు ఎవరు? అక్కడి పాలన, తదితర పరిస్థితులు, ఎన్నికల నిర్వహణ తదితర విషయాలపై అందరిలోనూ సందేహాలు నెలకొన్నాయి. అయితే ఆ దేశ భవిష్యత్తుపై ట్రంప్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.  ఆ దేశంలో ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ లేదని తెలిపారు.

ట్రంప్ మాట్లాడుతూ.. "మనం మెుదటగా దేశాన్ని సరిచేయాలి, ప్రజలు ఓటు వేయలేని పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకూడదు. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరించేలా యుఎస్ ఆయిల్ కంపెనీలు ప్రధాన పాత్ర వహిస్తాయి. మెుదటగా యుఎస్ ఆయిల్ కంపెనీలు వెనెజువెలాలో పెట్టుబడులు పెడతాయి. అనంతరం ఆ మెుత్తాన్ని దాని రెవెన్యూ ద్వారా రీయంబర్స్‌మెంట్ చేసుకుంటాయి." అని అన్నారు.

ఈ వ్యవస్థ మెుత్తం సెట్ కావడానికి 18 నెలల వరకూ సమయం పడుతుందని ట్రంప్ తెలిపారు. వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని డ్రగ్స్ అమ్మేవారితో అమెరికా ఎప్పుడు యుద్ధం చేయదని తెలిపారు. ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఆదేశ నాయకత్వమే కారణమని తెలిపారు.

అయితే అక్కడే ఉన్న ఒక జర్నలిస్టు అంతిమంగా వెనెజువెలా ఛార్జ్ ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించగా ట్రంప్ దానికి బదులిస్తూ అది 'నేనే' అని తెలిపారు. తన సెక్రటరీ స్పానిష్ భాష చాలా బాగా మాట్లాడుతుందని ఆ వ్యవహారాలు తాను చూసుకుంటుందని తెలిపారు. ఒకవేళ వెనెజువెలాలో పరిస్థితులు అదుపులో లేకపోతే మరోసారి దాడి చేయడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.

Videos

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)