Breaking News

‘ఏడు కాదు ఎనిమిది’.. ట్రంప్‌ సరికొత్త వాదన

Published on Thu, 11/06/2025 - 09:23

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోమారు భారత్‌-పాక్‌ మధ్య శాంతి ఒ‍ప్పందం కుదిర్చానంటూ పాడినపాటే పాడారు. అలాగే భారత్-పాకిస్తాన్ వివాదంలో ఏడు విమానాలు కూలిపోయాయనే నిరాధార వాదనను మళ్లీ వినిపించారు. అయితే ఈసారి విమానాల సంఖ్యను పెంచడం విశేషం. ఆ రెండు అణ్వాయుధ దేశాలతో తాము వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని బెదిరించిన తర్వాతనే  అవి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయని ట్రంప్‌ అన్నారు.

మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో మాట్లాడిన ట్రంప్‌ తాను.. భారత్‌- పాక్‌ మధ్య  శాంతి నెలకొనేందుకు మధ్యవర్తిత్వం వహించానని మరోమారు అన్నారు. ‘నాడు నేను భారత్‌- పాకిస్తాన్‌లతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నాను. ఇంతలో ఒక  వార్తాపత్రిక మొదటి పేజీలో.. వారు యుద్ధానికి దిగుతున్నారని చదివాను. ఏడు విమానాలు తగలబడ్డాయి. ఎనిమిదవది చాలావరకూ ధ్వంసం అయ్యింది. మొత్తం ఎనిమిది విమానాలు కాలిపోయాయి..’ అవి రెండూ అణ్వాయుధ దేశాలు. ‘మీరు శాంతికి అంగీకరిస్తే తప్ప నేను మీతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను’ అని నేను వారికి చెప్పాను’ అని ట్రంప్ అన్నారు.

అయితే ఢిల్లీ- ఇస్లామాబాద్‌లు యుద్ధం ముప్పును వ్యతిరేకించాయి. ఈ ఘర్షణకు వాణిజ్య ఒప్పందాలతో సంబంధం లేదని తెలిపాయని ట్రంప్‌  పేర్కొన్నారు. వెంటనే తాను స్పందిస్తూ ‘మీరు అణ్వాయుధ శక్తులు. నేను మీతో వ్యాపారం చేయడం లేదు. మీరు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు మేము మీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోవడం లేదు’ అని  స్పష్టం చేశానని ట్రంప్‌ పేర్కొన్నారు. ఆ మర్నాడే ఆ రెండు దేశాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తనకు ఫోన్ వచ్చిందని ట్రంప్‌ తెలిపారు. దీంతో తాను వారితో ‘ధన్యవాదాలు.. వాణిజ్యం చేద్దాం’ అని చెప్పానన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వాదనను భారత్‌ తిరస్కరించింది. పాకిస్తాన్ కమాండర్లు ఈ దాడిని ఆపాలంటూ భారత సైన్యాన్ని వేడుకున్న దరిమిలా, మే 10న కాల్పుల విరమణ జరిగిందని భారత్‌ స్పష్టం చేసింది. అయితే ట్రంప్.. అమెరికా మధ్యవర్తిత్వ చర్చల తర్వాతనే భారత్‌- పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని  ఇప్పటివరకూ 60 సార్లు చెప్పారని చేశారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది పౌరులను దారుణంగా హతమార్చిన దరిమిలా భారత్‌ ‘ఆపరేషన్‌ సింధూర్‌’ చేపట్టింది. ఈ నేపధ్యంలోనే భారత్‌..  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.

ఇది కూడా చదవండి: ‘ఇక మొదలెడదాం’.. తొలి పోస్టులో మమ్దానీ

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)