Breaking News

ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. ట్రంప్‌ నోట అదే మాట

Published on Tue, 09/23/2025 - 21:35

వాషింగ్టన్‌: ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పాత పాటే పాడారు. అమెరికా అధ్యక్షుడిగా కేవలం ఏడు నెలల కాలంలో ఏడు యుద్ధాలు ఆపాను. అందుకే తన పరిపాలన స్వర్ణయుగం అంటూ అభివర్ణించారు.  

అమెరికా న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి 80వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగించారు. ‘ఇజ్రాయెల్ -ఇరాన్, భారత్‌-పాకిస్థాన్‌, రువాండా - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, థాయిలాండ్-కంబోడియా, అర్మేనియా -అజర్‌బైజాన్, ఈజిప్ట్ - ఇథియోపియా, సెర్బియా -కొసావో దేశాల మధ్య అంతులేని యుద్ధాల్ని ముగించా.  

కొన్ని యుద్ధాలు 31 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మరికొన్ని 36ఏళ్లుగా కొనసాగుతున్నాయి. అలాంటి అంతులేని ‍యుద్ధాల్లో నేను ఏడు యుద్ధాలు ఆపాను. మరే ఇతర అధ్యక్షుడు వాటిని ఆపే ప్రయత్నం చేయలేదు. కానీ నేను వాటిని ఆపాను. భారత్‌-పాక్‌ యుద్ధాన్ని కూడా నేనే ఆపా. ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నా. ప్రజల ప్రాణాలు కాపాడటమే నాకు అసలైన నోబెల్‌ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిపై విమర్శలు గుప్పించారు. యుద్ధాలు ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది. ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. దేశాల మధ్య యుద్ధ సమస్యల్ని పరిష్కరించేలా సహాయం చేసేందుకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్యసమితి తన సామర్ధ్యాన్ని కోల్పోయింది. ఐక్యరాజ్య సమితివన్నీ ఒట్టి మాటలే. ఆ ఒట్టి మాటలు యుద్ధాల్ని ఆపలేవు’ అని ట్రంప్ అన్నారు.

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)