Breaking News

ఆర్థిక మాంద్యం భయాల వేళ ట్రంప్‌ ఏమన్నారంటే..

Published on Sat, 04/05/2025 - 10:03

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై అమెరికా పరస్పర సుంకాలతో.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కకావికలం అవుతున్నాయి. ఆర్థిక మాంధ్యం భయాలు నెలకొని.. అమెరికా మార్కెట్లు సైతం భారీ నష్టాలతో కుదేలు అవుతోంది. వరుసగా రెండో రోజూ వాల్‌స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్‌తో పలు కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయి. అయినప్పటికీ.. మరేం ఫర్వాలేదని ఆ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారు.  

మార్కెట్‌ క్రాష్‌ భయాలను తోసిపుచ్చిన ఆయన.. తన టారిఫ్‌ల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి మార్పులు ఉండబోవని కుండబద్ధలు కొట్టారు. టారిఫ్‌ నిర్ణయం వల్ల అమెరికాలోకి పెట్టుబడి పెట్టడానికి చాలా మంది వస్తున్నారని, మున్నుపెన్నడూ లేని స్థాయిలో ధనవంతులు కావడానికి ఇదే మంచి సమయమని ట్రూత్‌లో ఓ పోస్టు చేశారు.  

పైగా తన నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సూపర్‌ ఛార్జ్‌గా పనికొస్తుందని.. టారిఫ్‌ల వల్ల బడా వ్యాపారాలకు వచ్చిన నష్టమేమీ లేదని అంటున్నారాయన. తాను విధించిన పరస్పర సుంకాలతో దిగుమతికి బదులు.. కంపెనీలు అమెరికా గడ్డపై ఉత్పత్తిని ప్రారంభిస్తాయని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నారు. తద్వారా ఉద్యోగాల కల్పన, అటుపై అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చివేసే అవకాశం ఉందని భావిస్తున్నారాయన. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)