Breaking News

అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్‌ మరో సంచలన ప్రకటన

Published on Thu, 06/12/2025 - 10:20

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్య ప్రాచ్యం(Middle East) నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతాల బలగాలనూ వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారాయాన. 

‘‘అదో ప్రమాదకరమైన ప్రాంతం(Middle East Most Dangerous). అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మీడియా ప్రతినిధులతో ట్రంప్‌ అన్నారు. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే బలగాలను ట్రంప్‌ వెనక్కి రప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు.. ఇరాన్‌ న్యూక్లియర్‌ ఆయుధాలు (Iran Nuclear Weapons) కలిగి ఉండటానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు’’ అంటూ ట్రంప్‌ కామెంట్‌ చేశారు. 

రాయిటర్స్‌ కథనం ప్రకారం.. ఇరాక్‌ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిలో కొంత మందిని అత్యవసరంగా వెనక్కి రావాలని అమెరికా ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే బాగ్దాద్‌లో మోహరించిన బలగాలనూ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. పెరిగిన ఆయిల్‌ ధరలు(4 శాతం పెరుగుదల) కారణమై ఉండొచ్చన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. 

బహ్రయిన్‌, కువైట్‌ నుంచి బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా భద్రతా విభాగం (State Deparment) ప్రకటించింది. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.  చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాక్‌, కువైట్‌, ఖతార్‌, బహ్రయిన్‌, యూఏఈలలో అమెరికా బలగాలు  ఇంతకాలం మోహరించి ఉన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)