Breaking News

కెనడాపై ట్రంప్‌ టారిఫ్‌ కొరడా

Published on Wed, 07/22/2026 - 05:43

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పొరుగు దేశం కెనెడాపై మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. అమెరికాలో తయారయ్యే వాహనాలు, మద్యం, పాల ఉత్పత్తులపై కెనెడా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ దేశపు దిగుమతులు అత్యధికంపై యాభై శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కొత్త పన్నులు మరో ముప్ఫై రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామం కాస్తా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని అంచనా. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్‌ పలు దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడగా చైనా, కెనెడాలు మాత్రమే ప్రతీకార పన్నులను విధించిన విషయం తెలిసిందే.

ఈ కారణంగానే కెనెడాకు బుద్ది చెప్పాలని ట్రంప్‌ తాజా టారిఫ్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. టారిఫ్‌లను ప్రకటిస్తూ ట్రంప్‌ మూడు ఉత్తర్వులపై సంతకాలు చేశారని, అది కూడా 1930 నాటి వాణిజ్య చట్టంలోని వివాదాస్పద సెక్షన్‌ 338 కింద ఉత్తర్వులు వెలువడ్డాయని ఆ అధికారి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ట్రంప్‌ వాడే అవకాశం ఉన్నందున ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని డెమోక్రాటిక్‌ పార్టీ ప్రతినిధులు ఏడాదిగా కోరుతున్నారు. ట్రంప్‌ కొత్తగా విధించిన టారిఫ్‌ల నుంచి ఇంధన ఉత్పత్తులు, పొటాష్, చేపలు, కొన్ని కీలకమైన ఖనిజాలకు మాత్రమే మినహాయింపు ఉంది.

దిగుమతి పన్నుల విషయమై జరిగిన యునైటెడ్‌ స్టేట్స్‌–మెక్సికో–కెనెడా ఒప్పందంలో రక్షణ కల్పించిన వస్తువులకు కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. అయితే ఈ ఒప్పందం 2020లోనే ముగియడం తదుపరి పునరుద్ధరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది.  తాజా టారిఫ్‌లపై కెనెడా ఇప్పటివరకూ స్పందించలేదు కానీ... ఒంటారియో అధ్యక్షుడు డగ్‌ ఫోర్డ్‌ మాత్రం ఈ నిర్ణయం కాస్తా వాణిజ్య పోరుకు దారితీసే అవకాశముందని వ్యాఖ్యానించారు.

ప్రతి అదనపు టారిఫ్‌కు కెనెడా దీటుగా ప్రతి టారిఫ్‌లు విధిస్తుందని ఫోర్డ్‌ తన సోషల్‌మీడియా పోస్టులో తెలిపారు. కెనెడా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సీఈఓ కాన్‌డేస్‌ లియాంగ్‌ కూడా ట్రంప్‌ నిర్ణయం దురదృష్టకరమని చెబుతూ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చేందుకు 30 రోజుల గడువు ఉన్నందున ఏమైనా జరగవచ్చునని అన్నారు. మరోవైపు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు అంతార్జతీయంగానూ ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చునని కాటో ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన స్కాట్‌ లిన్‌సికోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  

ట్రంప్‌ ముందు బోలెడన్ని రిస్‌్కలు 
కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు రాజకీయంగా, ఆర్థికంగానూ ట్రంప్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించవచ్చునని పరిశీలకుల అంచనా. నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరుగుతూండటం ఒక కారణం. గత ఏడాది లిబరేషన్‌ డే సందర్భంగా విధించిన పన్నులు స్టాక్‌మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్‌ టారిఫ్‌లపై వెనక్కు తగ్గారు. ఈ సారి ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)