Breaking News

మీ పాలసీ మాకొద్దు.. అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేకత

Published on Wed, 01/28/2026 - 04:08

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీపై USAలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. తాజాగా జరిపిన సర్వేలో ఇదే అంశం వెల్లడైంది. అమెరికాను గొప్పగా చేస్తానంటూ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు చర్యలతో ఆ దేశ ప్రజలలో ఆయన తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తుంది.  

"మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్"‍ అనేది అమెరికా అధ్యక్షుడి ఎన్నికల నినాదం యుఎస్‌ఎను మరోసారి స్ట్రాంగ్ చేస్తానంటూ ప్రచారం చేసిన ట్రంప్ ఎట్టకేలకు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం అమెరికా సొమ్మును వేరే దేశాల వారు దోచుకుంటున్నారంటూ హంగామా చేసి ఇష్టారీతిన ఇమిగ్రేషన్ పాలసీని మార్చి వలస కార్మికులపై కఠిన నిబంధనలు విధించారు. తాజాగా ఇప్పుడు ఆ నిబంధనలే ఆయనపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా చేశాయి.

అమెరికాలో వలస నియంత్రణ కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల దాడులు ఇటీవల శృతిమించుతున్నాయి. గతేడాది వీరు జరిగిన దాడుల్లో 32మంది మరణించగా ఇటీవల మిన్నెసోటా రాష్ట్రంలో జరిపిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసవిధానంపై అమెరికన్లు గుర్రుగా ఉన్నారు. కేవలం 39 శాతం ప్రజలు మాత్రమే ట్రంప్ వలస విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

అదే గత నెలలో ఈ సంఖ్య 41శాతంగా ఉంది. దీనిని 53 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. గతేడాది  ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో ఆయన నిర్ణయాలకు 50 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అయితే మెుత్తంగా ఆయన నిర్ణయాలకు జనవరిలో 41శాతం మంది ఆమెదం తెలుపగా  ప్రస్తుతం ఆ సంఖ్య 38 శాతానికి దిగజారింది 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)