Breaking News

ఆరోగ్యంపై ట్రంప్ కీలక అప్‌డేట్

Published on Fri, 01/02/2026 - 19:38

వాషింగ్టన్: అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పర్‌ఫెక్ట్‌గా ఉందన్నారు. అయితే డాక్టర్లు చెప్పిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్పిరిన్ తీసుకుంటున్నానని వాల్‌స్ట్రీట్‌ జర్నల్స్‌కిచ్చిన ఇంటర్వూలో ట్రంప్ తన హెల్త్ సీక్రెట్స్ బయిటపెట్టారు.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గతంలో అనేక పుకార్లు వచ్చాయి. ఆయన కొద్దిరోజులు కనబడపోవడం, బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ట్రంప్ మిస్సింగ్ అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆయన చేతిపై, కాళ్లపై గాయాలుండడం వాటిని కవర్ చేస్తూ ట్రంప్ మేకప్ వేసుకున్న చిత్రాలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ట్రంప్ స్పందించారు. "నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను" అని వివరణ ఇవ్వడంతో  అప్పట్లో అంతా సైలంట్‌ అయ్యారు.

అయితే తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. " నా ఆరోగ్యంపై మాట్లాడడం ఇది 25వసారి. గత 25 ఏళ్లుగా ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నా. డాక్టర్లు 81mg తీసుకోమని చెబితే, నేను 325mg తీసుకుంటున్నాను. రక్తాన్ని పలుచగా చేయడంలో అంది ఏంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నా గుండెలో చిక్కటి రక్తం వెళ్లడం నాకు ఇష్టం లేదు" అని ట్రంప్ అన్నారు.      

వైట్‌హౌస్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమాలలో తాను వినడానికి ఇబ్బందులు పడుతున్నానని, తరచుగా నిద్రపోతున్నానని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ట్రంప్ తెలిపారు. తన ఆరోగ్యం గురించి చర్చించడం తనను చాలా ఇబ్బందులకు గురిచేస్తోందదన్నారు.. అయితే తనకు వ్యాయామం అంటే అస్సలు నచ్చదని ట్రెడ్‌మిల్‌పై నడవడం, పరిగెత్తడం చాలా బోరింగ్‌గా ఉంటుందని తెలిపారు. తన చేతులపై ఇప్పుడు కొన్ని గాయాలున్నాయని వాటికి 10 నిమిషాలు మేకప్ వేసుకుంటే సరిపోతుందని  వాల్‌ స్ట్రీట్స్ జనరల్‌కిచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ట్రంప్ వయస్సు ప్రస్తుతం 79 సంవత్సరాలు. ఆయన 70 సంవత్సరాల వయసులో అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకూ అదే పెద్దవయస్సు, అయితే 78 సంవత్సరాల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి జో బైడెన్ ఆ రికార్డును బ్రేక్ చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)