Breaking News

ఆమె మూల్యం చెల్లించుకోక తప్పదు: ట్రంప్‌

Published on Wed, 09/11/2024 - 20:02

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు తాను మద్దతిస్తున్నట్లు అమెరికన్‌ పాప్‌స్టార్‌ టేలర్‌ స్విఫ్ట్‌ తెలిపారు.అయితే తాజాగా ఆమె  కమలకు మద్దతు  ఇవ్వటంపై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ టేలర్‌ స్విఫ్ట్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఆమె ఎప్పుడూ డెమోక్రట్లకే మద్దతు పలుకుతుందని విమర్శలు గుప్పించారు. 

ట్రంప్‌ బుధవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ నేను టేలర్ స్విఫ్ట్ అభిమానిని కాదు. ఆమె చాలా ఉదారవాద వ్యక్తి. ఆమె ఎల్లప్పుడూ డెమొక్రాట్ల మాత్రమే సమర్థిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆమె తర్వాత తగిన మూల్యం చెల్లించవల్సి వస్తుంది’’ అని అన్నారు.

కమల హారిస్, డొనాల్డ్‌ తొలి డిబేట్‌ పూర్తి అయిన వెంటనే టేలర్‌ స్విఫ్ట్‌ తన మద్దతును సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. ‘ అధ్యక్ష ఎన్నికల్లో నేను డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, టిమ్ వాల్జ్‌కు ఓటు వేస్తాను. ఎందుకంటే ఆమె దేశ ప్రజల హక్కుల కోసం  పోరాటం చేస్తున్నారు. వారియర్‌ అయిన కమల ఛాంపియన్‌గా గెలవాల్సిన అవసరం ఉంది. గొడవలు, గందరగోళం లేకుండా ప్రశాంతంగా పరిపాలన అందిస్తే.. దేశంలో మనం చాలా ఎక్కువగా సాధించగలమని నమ్ముతున్నా’ అని  పేర్కొన్నారు.

మరోవైపు.. అభిమానులు ‘స్విఫ్టీస్ ఫర్ కమల’ అని కమలా హారిస్‌ కోసం ప్రచారం ప్రారంభించినా మంగళవారం వరకు కూడా టేలర్   స్పందించలేదు. అయితే మరికొంత మంది ఆమె ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు ఏఐ జనరేటెడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఆసత్య ప్రచారానికి చెక్‌ పెడుతూ కమలకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఏఐతో భయం కలుగుతోందని, తప్పుడు ప్రచారం ఆందోళన కలిగిస్తోందని  ఆమె పేర్కొన్నారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)