Breaking News

ఫెడరల్‌ నియంత్రణలోకి  వాషింగ్టన్‌ డీసీ 

Published on Tue, 08/12/2025 - 06:13

వాషింగ్టన్‌: దేశ రాజధాని వాషింగ్టన్‌ డీసీ హింసాత్మక గ్యాంగ్‌లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్‌ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్‌ గార్డ్స్‌ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్‌ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు.

 అవసరమైతే మరింతమంది నేషనల్‌ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్‌ ఈ వారంలోనే ఫెడరల్‌ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ తెలిపారు. 

నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి 
‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్‌ అంతకుముందు సొంత ట్రూత్‌ సోషల్‌లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలంటూ ఫెడరల్‌ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)