Breaking News

భైడెన్‌కు ఏమీ తెలియదు.. ఆ సంతకాలు చెల్లవు: డొనాల్డ్ ట్రంప్‌

Published on Mon, 03/17/2025 - 15:59

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనంగానో వివాదాస్పదంగానో మారుతోంది. గత ప్రభుత్వాలు తీరుకు భిన్నంగా ట్రంప్ పాలన కొనసాగుతోంది. ఏది చేసినా తానే అమలు చేయాలి అన్న చందంగా ఉంది ట్రంప్‌ తీరు. అక్రమ వలసల వెనక్కి పంపించే నిర్ణయం దగ్గర్నుంచీ, ‘గ్రీన్ కార్డు రద్దు’ అంశం ఇలా ట్రంప్‌ తీసుకున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని డొనాల్డ్ ట్రంప్ తాజాగా తప్పుబట్టారు. అధ్యక్షుడిగా దిగిపోవడానికి కొన్ని గంటల ముందు పలువురికి క్షమాబిక్షలు ప్రసాదించారు బైడెన్. అధ్యక్షుడిగా తనకున్న విచాక్షణాధికారాలతో బైడెన్ ముందుకెళ్లారు.  అయితే అది సరైన చర్య కాదంటూ ట్రంప్‌ తాజాగా డిక్లేర్‌ చేశారు.

 అవి చెల్లవు.. బైడెన్ కు ఏమీ తెలియదు
అయితే ఆ క్షమాభిక్షలు చెల్లవు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అసలు బైడెన్ కు ఏమీ తెలియదని, అది  బైడెన్ దిగి పోవడానికి చివరి గంటల్లో కాకతాళీయంగా చర్యగా అభివర్ణించారు. ఆ సమయంలో విచారణ జరిపిన కమిటీలోని సభ్యులు క్షమాభిక్షలు ఇవ్వడం కూడా చెల్లదన్నారు  ‘ఆ సంతకం చేసింది బైడెన్ కాదు.. బైడెన్ కు ఆ సంతకాలు గురించి కూడా ఏమీ తెలియదు. నా పరిభాషలో చెప్పాలంటే అవి ఆటోపెన్ సంతకాలు’ అంటూ ట్రంప్ కొత్త పల్లవి అందుకున్నారు.

కాగా, ప్రధానంగా 2021, జనవరి ఆరో తేదీన క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడికి సంబంధించిన శిక్ష అనుభవిస్తున్న వారికి బైడెన్ క్షమాభిక్ష కింద విముక్తి కల్పించారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రతీకార చర్యలు తీసుకునేందుకు వీలులేకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతో చివరి గంటల్లో జో బైడెన్ క్షమాభిక్షలు ఇచ్చారు. అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్‌ జనరల్‌ మార్క్‌ మిల్లె తదితరులకు ముందస్తు క్షమాభిక్ష జారీ చేశారు. అలాగే, క్యాపిటల్‌ హిల్‌ దాడులపై విచారణ జరిపిన హౌస్‌ కమిటీ సభ్యులకూ కూడా ఉపశమనం కల్పించారు బైడెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)