Breaking News

కమల ఇంటర్వ్యూ ఎడిట్‌ చేశారు: డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Tue, 10/22/2024 - 11:02

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి కృషి చేస్తున్నారు. మరోవైపు.. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో అక్టోబర్ 7న జరిగిన ఇంటర్వ్యూను మోసపూరితంగా ఎడిటింగ్ చేశారని ట్రంప్‌ ఆరోపణలు చేస్తున్నారు. ఒకే ప్రశ్నకు రెండు వేర్వేరు సమాధానాలు ప్రసారం చేశారంటూ సీబీఎస్‌ నెట్‌వర్క్‌పై వ్యాఖ్యలు చేశారు.

అయితే.. ట్రంప్‌ ఆరోపణలను ఇప్పటికే సీబీఎస్‌ నెట్‌వర్క్‌ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌ చేసిన ఆరోపణలు అసత్యమని పేర్కొంది. ‘ఫేస్ ది నేషన్‌’ న్యూస్‌ ప్రోగ్రాం కంటే ‘60 మినిట్స్’ ప్రోగ్రాంలో ప్రసారమైన కమలా హారిస్  ఇంటర్వ్యూ  అధిక భాగం ఉందని స్పష్టం చేసింది. ప్రసారమైన రెండు ప్రోగ్రాముల్లో ఒకే ప్రశ్నకు స్పందించినా.. కమల సమాధానంలోని వివిధ భాగాలను హైలైట్ చేశాయని తెలిపింది.

‘‘మేము ఏదైనా ఇంటర్వ్యూని ఎడిట్ చేసినప్పుడు. ఒక రాజకీయవేత్త, అథ్లెట్ లేదా సినిమా స్టార్ అయినా మేము స్పష్టంగా ఖచ్చితంగా  ఉండటానికి ప్రయత్నిస్తాం’’ అని తెలిపింది. అయినా విమర్శలు ఆగటం లేదు. ఇంటర్వ్యూ పూర్తి వివరాలు విడుదల చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో ఫెడరల్ కమ్యూనికేషన్స్‌ కమిషన్ పూర్తి ఇంటర్వ్యూపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోపైపు.. సీబీఎస్‌ నెట్‌వర్క్‌పై  దావా వేస్తానంటూ  డొనాల్డ్‌ ట్రంప్ హెచ్చరించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)