Breaking News

భార‌త్‌-పాక్ యుద్దాన్ని నేనే ఆపా.. 11 ఫైట‌ర్ జెట్లు కూలిపోయాయి: ట్రంప్‌

Published on Fri, 02/20/2026 - 01:40

గ‌తేడాది భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి ప్రకటించారు.  గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన హెచ్చరికల వల్లే ఇరు దేశాలు వెన‌క్కి త‌గ్గాయ‌ని ట్రంప్ అన్నారు.

గ‌తేడాది మేలో పెహల్గ‌మ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా భార‌త సైన్యం ఆపరేషన్ సిందూర్ చేప‌ట్టింది. భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. దీంతో దాయాది దేశం ఉక్కిరి బిక్కిరి అయింది. పాక్ కూడా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో డ్రోన్ దాడుల‌కు పాక్ పాల్ప‌డింది. కానీ  భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేసింది.

దాదాపు నాలుగు రోజుల త‌ర్వాత పాక్-భార‌త్ మ‌ధ్య‌ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం జ‌రిగింది. అయితే ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్లు ప్రచారం జరిగింది. కానీ  కాల్పుల విరమణలో మూడో దేశం ప్రమేయం లేదని భారత్ ఇప్పటికే ప‌లు మార్లు స్పష్టం చేసింది. కానీ ట్రంప్ మాత్రం నేనే అపాన‌ని గొప్ప‌లు చెప్పుకొంటున్నారు. ఇప్పుడు మ‌రోసారి అదే పాట పాడారు.

"ఆ సమయంలో ఇరు దేశాల మ‌ధ్య యుద్దం తీవ్రంగా సాగుతోంది. విమానాలు కూలిపోతున్నాయి. భార‌త ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు, అలాగే పాక్ ప్రధాని కూడా తెలుసు. నేను ఇద్దరితోనూ ఫోన్లో మాట్లాడాను. యుద్ద విర‌మ‌ణ చేయ‌క‌పోతే మీ రెండు దేశాలతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోను. మీ దేశాల నుంచి వచ్చే వస్తువులపై 200 శాతం టారిఫ్ విధిస్తామ‌ని హెచ్చ‌రించాను. భారీగా నష్టపోతామని తెలియగానే రెండు దేశాలు వెన‌క్కి త‌గ్గాయి. ఈ స‌మ‌యంలో 11 ఖరీదైన యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ పేర్కొన్నారు
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)