Breaking News

అమెరికాకు ఐరన్‌ డోమ్‌ ఏర్పాటు చేస్తా: డొనాల్డ్‌ ట్రంప్‌

Published on Sun, 06/23/2024 - 12:55

న్యూయార్క్‌:  అమెరికా ఎ‍న్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల  తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌.. అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్‌ యూనివర్సిటీలో క్యాంపస్‌ వద్ద ట్రంప్‌ మాట్లాడారు.  

‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా.  యూఎస్‌- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో  వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను.  మోసగాడైన జో బైడెన్‌.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్‌ వలస నేరం’. 

.. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను.  బైడెన్‌ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా.  ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్‌ డోమ్‌ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్‌  అన్నారు.

ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్‌ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్‌ గ్రీన్‌  కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)