Breaking News

టిక్‌టాక్‌పై నిషేధం ఆపండి: ట్రంప్‌

Published on Sat, 12/28/2024 - 10:40

వాషింగ్టన్‌:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్‌టాక్‌(TikTok) యాప్‌ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్‌టాక్‌పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.

వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్‌ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు.  

కాగా,యాప్‌ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్‌ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్‌టాక్‌పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్‌టాక్‌ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్‌టాక్‌ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్‌టాక్‌ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.

ట్రంప్‌ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ టిక్‌టాక్‌పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో  బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్‌టాక్‌ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్‌ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్‌ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్‌టాక్‌ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను నిషేధించబోనని స్పష్టం చేశారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)