Breaking News

వలసల నియంత్రణాధికారిగా టామ్‌ హొమన్‌

Published on Tue, 11/12/2024 - 06:15

న్యూయార్క్‌: అమెరికా వలసల నియంత్రణ అధికారిగా యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మాజీ డైరెక్టర్‌ టామ్‌ హొమన్‌ను నియమిస్తున్నట్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొడతానన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘వలసల నియంత్రణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే టామ్‌ హొమన్‌ను మన దేశ సరిహద్దులకు ఇన్‌చార్జిగా నియమిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నా’అంటూ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ సైట్‌లో వెల్లడించారు. 

దేశ దక్షిణ, ఉత్తర సరిహద్దులతోపాటు సముద్ర, గగనతల బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటారన్నారు. దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపేయడాన్ని ఆయన పర్యవేక్షిస్తారన్నారు. ఈ బాధ్యతలకు టామ్‌ హొమన్‌నే ట్రంప్‌ నియమిస్తారంటూ ఇటీవల పలు కథనాలొచ్చాయి.కాగా, తాజా నియామకానికి సెనేట్‌ ఆమోదం అవసరం లేదు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు సైన్యం సాయం తీసుకోబోమంటూ ఇటీవల టాప్‌ హొమన్‌ ఇటీవల ఫాక్స్‌ న్యూస్‌ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది సమర్థంగా ఇటువంటి విధులను నిర్వర్తిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా, ఐరాసలో అమెరికా రాయబారిగా కాంగ్రెస్‌ సభ్యురాలు ఎలిస్‌ స్టెఫానిక్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)