Breaking News

గాజాలో శాంతికి ట్రంప్‌ డీల్‌? 

Published on Sat, 08/01/2026 - 05:26

వాషింగ్టన్‌/కైరో: ఇజ్రాయెల్‌ – పాలస్తీనా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందా? పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న హమాస్‌ ఆయుధాలు త్యజించేలా.. ఇజ్రాయెల్‌ గాజా ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రతిపాదన చేయడం.. ఇందుకు హమాస్‌ సైతం అంగీకరించడంతో ఆశలు కొద్దిగా చిగురిస్తున్నాయి. 

ఇజ్రాయెల్‌–గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తొమ్మిది నెలలకు అమెరికా గురువారం తాజా ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఒప్పందంలోని రెండు దశలో భాగంగా హమాస్‌ ఆయుధాలు వీడాల్సి ఉంది. అదే సమయంలో గాజా పునర్‌ నిర్మాణానికి ఒక అవగాహన కుదరాల్సి ఉంది. అయితే అప్పట్లో ఇరుపక్షాల మధ్య చర్చలు స్తంభించిపోగా.. తాజాగా దశలవారీగా దీన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని ట్రంప్‌ తన ఎక్స్‌ ఖాతాలో ప్రకటించారు. ‘‘హమాస్‌ ఆయుధాలు వీడిన వెంటనే ఇజ్రాయెల్‌ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. 

అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్‌ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రత బాధ్యతలు తీసుకుంటుంది’’అని ఆయన వివరించారు. ట్రంప్‌ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్‌ తన ఆయుధాలు వీడటమే కాకుండా... గాజా ప్రాంతంలోని తమ సొరంగ మార్గాలు అన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది. ట్రంప్‌ ప్రతిపాదనలకు తాము అంగీకారం తెలిపినట్లు హమాస్‌ కూడా శుక్రవారం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్‌ కూడా ఘర్షణ వైఖరిని వీడాలని, బలగాలను ఉపసంహరించుకోవాలని హమాస్‌ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్‌ ఒప్పందంపై ఇజ్రాయెల్‌ తన వైఖరిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

దశలవారీగా అమలు 
ట్రంప్‌ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చేందుకు మంచి అవకాశాలే ఉన్నట్టు అమెరికాతోపాటు గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఏర్పాటైన బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ అధికారులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ఎంత సమయం పడుతుందన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేమని వీరు అంటున్నారు. అయితే రానున్న రెండు వారాల్లో గాజా పోలీసు బలగాలు మాత్రం టెక్నక్రటిక్‌ బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌కు అందజేయనున్నారని తెలిపారు. గాజా పోలీసు బలగాలతోపాటు అనేక ఇతర సంస్థలు కూడా భారీ ఎత్తున ఆయుధాలు కలిగి ఉండటం గమనార్హం. వీరంతా ఒప్పందంలో భాగంగా ఉంటారా? అన్నది ప్రశ్న. హమాస్‌ వద్ద ఉన్న భారీ ఆయుధాల అప్పగింత, ధ్వంసం, సొరంగాల విధ్వంసం వంటివి తరువాతి దశల్లో జరగవచ్చునని, ఇందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ అధికారి ఒకరు తెలిపారు.  

అనుమానంగానే ఇజ్రాయెల్‌.. 
ట్రంప్‌ శాంతి ప్రతిపాదనపై హమాస్‌ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం ఇంకా సంశయంలోనే కొట్టుమిట్టాడుతోంది. హమాస్‌ ఆయుధాలు అప్పగిస్తుందన్న నమ్మకం ఇజ్రాయెల్‌కు లేదు. అయితే ఇజ్రాయెల్‌ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, గతంలో వారు అంగీకరించినట్టు గాజా ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం మాత్రమే చేస్తే చాలని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. దాంతోపాటే గాజా ప్రాంతంపై వైమానిక దాడులు నిలిపివేసేందుకు కూడా ఇజ్రాయెల్‌ గతంలోనే అంగీకరించిందని చెప్పారు. 

ఒకవేళ ఇజ్రాయెల్‌ తానిచ్చిన మాటకు కట్టుబడకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‘‘తీవ్రంగా నిరాశ చెందుతారు’’అని వ్యాఖ్యానించారు. డొనాల్డ్‌ ట్రంప్, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నేతన్యాహూలు మంగళవారమే వైట్‌హౌస్‌లో సమావేశమైన సంగతి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై మాత్రం ఇద్దరు నేతలు నోరు విప్పలేదు. ఇజ్రాయెల్‌పై దాడులు మొదలైన తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ దౌత్య కార్యాలయం కూడా ఏ రకమైన వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడలేదు.   
 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)