Breaking News

ట్రంప్‌ హవా.. అక్కడ కూడా గెలవబోతున్నారా..!

Published on Sat, 01/27/2024 - 08:41

వాషింగ్టన్‌: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దూసుకుపోతున్నారు. రిపబ్లిక్‌ పార్టీ తరపున అధ్యక్ష పదవికి ట్రంప్‌ నామినేషన్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్‌ భారీ విజయాలు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. 

ఇక ఫిబ్రవరి 24న జరిగే  సౌత్‌ కరోలినా రిపబ్లికన్‌ ప్రైమరీ బ్యాలెట్‌లోనూ ట్రంప్‌ గెలవబోతున్నారని సర్వేలు చెబుతుండడం విశేషం. అమెరికన్‌ ప్రామిస్‌,టైసన్‌ గ్రూపు చేసిన సర్వేలో ఇక్కడ ట్రంప్‌కు 58 శాతం రిపబ్లికన్లు మద్దతు పలుకుతుండగా రిపబ్లికన్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న నిక్కీ హాలేకు 31 శాతం మంది మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం.

2011 నుంచి 2017 వరకు సౌత్‌ కరోలినా గవర్నర్‌గా పనిచేసిన నిక్కీకి  ఇక్కడి ప్రైమరీలో గెలుపు చాలా ఈజీ అని అంతా భావించారు. అయితే సర్వేలు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే నిక్కీ పోటీలో వెనుకబడ్డట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా ట్రంప్‌ ఘన విజయం సాధిస్తే మాత్రం ఇక రిపబ్లికన్‌ అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్‌కు తిరుగుండకపోవచ్చని అంతా భావిస్తున్నారు.  

ఇదీచదవండి.. గాజాలో పౌరుల మరణాలను నివారించాలి

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)